Trump: మాజీ అధ్యక్షుడు బైడెన్ నిర్ణయం రద్దు 1 y ago
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బైడెన్ పదవి నుంచి దిగిపోయే ముందు తన సంతానానికి కల్పించే సీక్రెట్ సర్వీస్ రక్షణను జులై వరకు పొడిగించుకుంటూ ఉత్తర్వులపై సంతకం చేశారు. మాజీ అధ్యక్షుడు నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించడం గమనార్హం. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడించారు.